Congress Candidates First List : తెలంగాణలో ఎన్నికల హీట్.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

తొలి జాబితాలో ఉన్న లీడర్లు ఎవరు? ఏ జిల్లాలో ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కింది? కాంగ్రెస్ నుంచి బరిలో నిలవబోతున్న అభ్యర్థుల పేర్లను 10టీవీ.. Congress Candidates First List

Congress Candidates First List : తెలంగాణలో ఎన్నికల హీట్.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

Congress Candidates First List

Congress MLA Candidates : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ అందరికన్నా ముందుంది. ఇప్పటికే క్యాండిడేట్స్ ను ఖరారు చేసిన బీఆర్ఎస్.. ఈ నెల 16న అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. బీఆర్ఎస్ తొలి జాబితాలో 78మంది పేర్లు ఉంటాయని తెలుస్తోంది. అలాగే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీల్లో కూడా తొలి జాబితా సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను 10టీవీ ఎక్స్ క్లూజివ్ గా సంపాదించింది.

బీజేపీ విషయానికి వస్తే 39 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ కూడా తన ఫస్ట్ లిస్ట్ ను రెడీ చేసేసింది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో ఫైనల్ అయిన అభ్యర్థుల జాబితా 10టీవీ చేతిలో ఉంది. 54మందితో తొలి జాబితాను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో ఉన్న లీడర్లు ఎవరు? ఏ జిల్లాలో ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కింది? కాంగ్రెస్ నుంచి బరిలో నిలవబోతున్న అభ్యర్థుల పేర్లను 10టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందించింది.

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయబోయే అభర్థులతో కూడిన జాబితాను 10టీవీ సంపాదించింది. చివరి నిమిషంలో ఒకటి రెండు మార్పులు జరిగితే తప్ప దాదాపుగా ఇదే జాబితా ఖరారు కాబోతోంది.

Also Read..BRS Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. 78మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా సెప్టెంబర్ మొదటి వారం లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్ మొదటి జాబితాలో ఉండే అభ్యర్థుల పేర్లు..

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (4/10)
——————-
1 ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి/ భార్గవ్‌ దేశ్‌పాండే
2 మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు/ సురేఖ
3 నిర్మల్ – శ్రీహరి రావు
4 బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ( 4/9)
———————-
5 జుక్కల్ – గంగారాం
6 నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్‌ గౌడ్
7 కామారెడ్డి – షబ్బీర్ అలీ
8 బాల్కొండ – సునీల్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ( 12/13)
—————–
9 మంథని- శ్రీధర్ బాబు
10 వేములవాడ- ఆది శ్రీనివాస్
11 జగిత్యాల- జీవన్ రెడ్డి
12 హుస్నాబాద్- ప్రవీణ్ రెడ్డి
13 హుజురాబాద్- బాల్ముర్ వెంకట్
14 చొప్పదండి – మేడిపల్లి సత్యం
15 మానకొండూరు- కౌవ్వంపల్లి సత్యనారాయణ
16 సిరిసిల్ల – కె. కె. మహేందర్ రెడ్డి
17 రామగుండం – రాజ్ ఠాకూర్
18 పెద్దపల్లి – విజయ రమణా రావు
19 ధర్మపురి – లక్ష్మణ్ కుమార్‌
20 కోరుట్ల – జువ్వాడి నర్సింగ్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లా (4/10)
———
21 సంగారెడ్డి – జగ్గారెడ్డి
22 ఆందోల్ – దామోదర రాజనర్సింహా
23 జహీరాబాద్ – గీతా రెడ్డి
24 నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్‌

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ( 3/14)
——————
25 వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
26 ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
27 పరిగి – టి.రామ్మోహన్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ( 4/15)
——————
28 నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
29 జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
30 ముషీరాబాద్ – అనిల్ కుమార్
31 గోషామహల్ – మెట్టు సాయి కుమార్

Also Read..BJP Candidates First List : అసెంబ్లీ ఎన్నికలక బీజేపీ రెడీ.. తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (7/14)
——————-

32 నాగర్ కర్నూల్ – కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి
33 కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
34 కల్వకుర్తి -వంశీ చంద్‌ రెడ్డి
35 అచ్చంపేట – వంశీ కృష్ణ
36 షాద్‌నగర్ – ఈర్లపల్లి శంకర్
37 కొడంగల్ – రేవంత్ రెడ్డి
38 అలంపూర్ – సంపత్ కుమార్

ఉమ్మడి నల్లగొండ జిల్లా (8/12)
——————
39 నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి
40 హుజూర్ నగర్ – ఉత్తమ్‌ కుమార్ రెడ్డి
41 కోదాడ – ఉత్తమ్‌ పద్మావతి
42 నాగార్జున సాగర్ – జానారెడ్డి
43 మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి
44 తుంగతుర్తి- అద్దంకి దయాకర్
45 దేవరకొండ – బాలు నాయక్
46 ఆలేరు – బిర్ల ఐలయ్య

ఉమ్మడి వరంగల్ జిల్లా ( 5/12)
———————–
47 నర్సంపేట -దొంతి మాధవరెడ్డి
48 వరంగల్ పశ్చిమ – నాయిని రాజేందర్ రెడ్డి
49 వరంగల్ తూర్పు – కొండా సురేఖ
50 ములుగు – సీతక్క
51 భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ఉమ్మడి ఖమ్మం జిల్లా (3/10)
—————
52 మధిర – భట్టి విక్రమార్క
53 భద్రాచలం – పొడెం వీరయ్య
54 కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Also Read..Kodangal Constituency: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా.. నరేందర్ రెడ్డే మళ్లీ సత్తా చాటతారా?