MMTS రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటన.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతిపై అత్యాచారయత్నంకు సంబంధించిన కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు.

MMTS రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటన.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

MMTS Train women Incident

Updated On : March 25, 2025 / 11:24 AM IST

MMTS Train Incident: ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతిపై అత్యాచారయత్నంకు సంబంధించిన కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. పాత నేరస్తుడు జంగం మహేశ్ పై అనుమానంతో అతడి ఫొటోను పోలీసులు బాధితురాలికి చూపించారు. రైలులో తనపై దాడిచేసింది ఫొటోలోని వ్యక్తేనని బాధితురాలు పేర్కొంది. జంగం మహేశ్ మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసుగు గుర్తించారు. ఏడాది క్రితమే మహేశ్ ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటిరిగా ఉంటున్నాడు. మహేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

 

సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. యువతిపై అత్యాచారయత్నంకు ప్రయత్నించడంతో ఆమె తప్పించుకోవడానికి రైలులో నుండి కిందకు దూకింది. తీవ్రగాయాలతో గుడ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీంలో పడిఉన్న యువతిని చూసిన పాదారుడు.. 108కు సమాచారం ఇచ్చాడు. దీంతో యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు.

 

యువతి మేడ్చల్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో ఉంటూ స్విగ్గిలో పనిచేస్తుంది. సికింద్రాబాద్ లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోచ్ లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడిగా భావించి జంగం మహేశ్ ఫొటోను యువతికి చూపించగా.. అతడే నిందితుడని తేలింది.