Heavy Rains : తెలంగాణకు మోచా తుఫాన్ ముప్పు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

మోచా తుఫాన్ కారణంగా తెలంగాణలోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Heavy Rains : తెలంగాణలో గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పడనున్నాయి. రాష్ట్రానికి మోచా తుఫాన్ ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మే7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, మే8వ తేదీన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు మోచా తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మోచా తుఫాన్ కారణంగా తెలంగాణలోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చిరు జల్లులు పడతాయని తెలిపింది. మే6, 7వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.

Telangana Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

కాగా, శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ లో రాష్ట్రంలోనే అత్యధికంగా 34.5 డిగ్రీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్ నగర్ లో అత్యల్పంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 డిగ్రీల లోపు గరిష్ట, 20 డిగ్రీలపైన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి పూట కాస్త ఎండ ప్రభావం ఉంటుందని, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు