Telangana Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారు జామున మొదలైన వర్షం సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయంగా మారాయి.

Telangana Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం .. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Rain in Hyderabad

Telangana Rains: హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. శనివారం తెల్లవారు జామున వాతావరణం ఒక్కసారిగా చల్లబడంతోపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు రెండు గంటలకుపైగా ఎడతెరిపిలేకుండా భారీవర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులపై వర్షపునీరు నిలిచిఉంది. తాజాగా కురిసిన వర్షంతో రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rains : తెలంగాణలో మరో ఐదురోజులు భారీ వర్షాలు.. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో

శనివారం తెల్లవారు జామున జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, మాదాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి‌లో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఆయా నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని డ్రైయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.  ఇదిలాఉంటే.. అంబర్ పేట్ విట్టల్వాడిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా,  శేరిలింగంపల్లి కాజాగూడలో 7 సెంటీమీటర్లు, మల్కాజ్‌గిరి, గోషామహల్, జూబ్లీహిల్స్ ముషీరాబాద్ ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Rains : తెలంగాణలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ మూడు రోజులుపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు, వడగండ్లతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని , కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Hyderabad Rain : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఉరుములు, ఈదురుగాలులతో కుమ్మేసిన వాన

ముఖ్యంగా దక్షిణ తెలంగాణ‌లో అనేక చోట్ల వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 59 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి‌లో 47.5, కామారెడ్డి జిల్లాలో 47.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.