ఫిరోజ్ఖాన్.. కాంగ్రెస్ పార్టీ ఫైర్బ్రాండ్ లీడర్ అయిన ఈయనకు ఉన్న ఫాలోయింగే వేరు. హస్తం పార్టీ అంటే గిట్టని బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఫిరోజ్ భాయ్ అంటే ఫిదా అయిపోతారు. మసీదుకు వెళ్తారు..గుడికి వస్తారు..అన్ని మతాలు సమానం అంటారు. సాయం చేయడంలో ముందుంటారు. అలాంటి ఫిరోజ్ ఖాన్ గత ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసి..ఎంఐఎం అభ్యర్థిని ఓడించినంత పనిచేశారు. స్వల్ప తేడాతో ఓడినా.. బాధ పడలేదు. తాను ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ పవర్లోకి వచ్చిందని సంతోషపడ్డ ఆ నేతకు..ఎంఐఎం బెడద తప్పడం లేదట.
ఓల్డ్ సిటీలో భాగంగా ఉన్న నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు ఫిరోజ్ ఖాన్. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉందని తెలిసినా..వెంటనే వాలిపోతున్నారు. ఇలాగే డ్రైనేజ్, సీసీ రోడ్ల విషయంలో కాంట్రాక్టర్ తీరుపై ప్రశ్నించేందుకు వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అతని అనుచరులు అక్కడికి వచ్చేశారు.
ఒకే తీరుగా నోటీసులు
ఫిరోజ్ ఖాన్ అతని అనుచరులపై దాడి చేశారు. అతికష్టం మీద పోలీసులు రెండువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే..దాడికి చేసిన ఎంఐఎంకు..ఫిరోజ్ ఖాన్‌కు పోలీసులు ఒకే తీరుగా నోటీసులు ఇచ్చారు. దీంతో ఫిరోజ్ ఖాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అధికార పార్టీ నేతగా ఉన్న తనపై దాడి జరిగితే..దాడిచేసిన వారి మీద యాక్షన్ తీసుకోకపోగా తనను అవమానించడంతో పాటు తన క్యాడర్ నిరుత్సాహానికి గురిచేసేలా పోలీసుల నోటీసులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట..కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన నేతలనే నియోజకవర్గ ఇంచార్జ్లుగా అధికారం చెలాయిస్తున్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ ఇంచార్జిల మాటే వింటున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉంటుంది.
లోకల్‌గా నో కాంప్రమైజ్
దీంతో చేసేదేమి లేక కాంగ్రెస్ నేతలు సైలెంట్ అవుతున్నారు. కానీ ఫిరోజ్ ఖాన్ వంటి నేతలు లోకల్‌గా కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎంఐఎం విషయంలో ఫిరోజ్ ఖాన్ మొదటి నుంచి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు..నాంపల్లిలో జరిగిన పరిణామాలపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు టాక్. ఫిరోజ్ ఖాన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతానంటున్నారు. అయితే సీఎం జోక్యం చేసుకుని సమస్యకు ఫుల్స్టాఫ్ పెడుతారా లేక నాంపల్లిలో వివాదం ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. అయితే అధికారంలోకి వస్తే పెద్ద పదవి వస్తుందని ఆశపడ్డ ఫిరోజ్ ఖాన్‌కు ఎంఐఎం రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాదు పతంగి పార్టీతో హస్తం పార్టీ దోస్తానా చేస్తుండటంతో..ఫిరోజ్ ఖాన్‌ను కాంగ్రెస్ పట్టించుకుంటుందా లేదా అన్నది కూడా డౌట్‌గానే ఉంది.
ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?: రాహుల్ గాంధీ