ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?: రాహుల్ గాంధీ

మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం ఇంతకుముందు చోటుచేసుకున్న బాలాసోర్ ఘోర ప్రమాదానికి అద్దం పడుతోందని చెప్పారు.

ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : October 12, 2024 / 12:32 PM IST

కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడులో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో 19 మందికి గాయాలయ్యాయి. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.

“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం ఇంతకుముందు చోటుచేసుకున్న బాలాసోర్ ఘోర ప్రమాదానికి అద్దం పడుతోంది. ఒక ప్యాసింజర్ రైలు వచ్చి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఎన్నో ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలి.

ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, ఈ రైలు ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో అందులోని ప్రయాణికులు మాత్రమే గాయపడ్డారని సమాచారం.

జ‌గ‌నాసురుడి దుష్ట‌పాల‌నను జ‌నమే అంత‌మొందించారు.. విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు: నారా లోకేశ్