Rahul Gandhi
కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడులో భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో 19 మందికి గాయాలయ్యాయి. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.
“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం ఇంతకుముందు చోటుచేసుకున్న బాలాసోర్ ఘోర ప్రమాదానికి అద్దం పడుతోంది. ఒక ప్యాసింజర్ రైలు వచ్చి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఎన్నో ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలి.
ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, ఈ రైలు ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో అందులోని ప్రయాణికులు మాత్రమే గాయపడ్డారని సమాచారం.
The Mysuru-Darbhanga train accident mirrors the horrific Balasore accident—a passenger train colliding with a stationary goods train.
Despite many lives lost in numerous accidents, no lessons are learned. Accountability starts at the top. How many more families must be… https://t.co/ggCGlgCXOE
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2024
జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు.. విజయదశమి శుభాకాంక్షలు: నారా లోకేశ్