Cyclone Montha: ‘మొంథా’ ఎఫెక్ట్ వల్ల వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది.
వరదల్లో గల్లంతై ఎస్సార్ నగర్ వృద్ధుడు ఆడేపు కృష్ణమూర్తి, కొండపర్తిలో ఇల్లు కూలి వృద్ధురాలు సూరమ్మ, హనుమకొండ టీవీ టవర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి పాక శ్రీనివాస్, ఎల్కతుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం, బోళ్లమత్తడి వాగులో గల్లంతై యువతి శ్రావ్య, మహబూబాబాద్ జిల్లా జంపన్నవాగులో సంపత్, శివనగర్ నేతాజీ స్కూల్ వద్ద అనిల్ మృతి చెందారు. (Cyclone Montha)
Also Read: ఖమ్మంలో ఘోరం.. వాకింగ్‌కు వెళ్లిన సీపీఐ నాయకుడిని దారుణంగా చంపిన దుండగులు
అనిల్ మృతదేహం వరద నీటిలో కొట్టుకు వచ్చింది. మృతుడు గీసుకొండకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎంజీఎం మార్చురీకి అతడి మృతదేహాన్ని తరలించారు.
వరంగల్‌లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 45 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మున్నేరు వాగు ఉద్ధృతి పెరిగింది. రహదారులపై నీళ్లు చేరడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ అనేక కాలనీల్లో నీళ్లు నిలిచే ఉంది.