ఖమ్మంలో ఘోరం.. వాకింగ్‌కు వెళ్లిన సీపీఎం నాయకుడిని దారుణంగా చంపిన దుండగులు
సామినేని రామారావు హత్య పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
                            
Samineni Rama Rao: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన వాకింగ్ చేస్తుండగా, ముగ్గురు దుండగులు గొంతుకోసి చంపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే హత్య చేశారని గ్రామస్థులు అంటున్నారు. సామినేని రామారావు ( Samineni Rama Rao) సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
Also Read: Rains in Telangana: తీవ్ర అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన..
సామినేని రామారావు హత్య పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. హింసాయుత రాజకీయాలకు తావు లేదని అన్నారు.
శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను డిప్యూటీ సీఎం సీరియస్‌గా హెచ్చరించారు. క్లూస్ టీం, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.






