Rains in Telangana: తీవ్ర అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షం కురిసింది.
 
                            
Rains in Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్రవాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి, నిన్న తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగింది.
ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉంది, దీంతో రాష్ట్రంలో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగానే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు వరకు కురిసే వర్షాలు అధికంగా నమోదవుతున్నాయి.
ఈ మూడు నెలల్లో సాధారణంగా 11.02 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. అయితే, ఒక్క అక్టోబరులోనే 17.49 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇంకా రెండు నెలల్లో ఎంత నమోదవుతుందో చూడాల్సి ఉంది.
వరంగల్, ఖమ్మం నగరాలను వర్షం ముంచెత్తింది. కాలనీల్లో నీళ్లు పెద్ద ఎత్తున నిలిచాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరించారు. భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా 12 మంది మృతి చెందారు. 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.






