Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపోల్స్.. నామినేషన్లు క్లోజ్.. చివరి రోజు భారీగా దాఖలు
ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
Municipal Elections Representative Image (Image Credit To Original Source)
- ముగిసిన నామినేషన్ల పర్వం
- చివరి రోజు అన్ని జిల్లాల్లో భారీగా నామినేషన్లు దాఖలు
- 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులకు ఎన్నికలు
Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ల డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు తీస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయడంతో అలకలు, బుజ్జగింపులు కనిపించాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 2వేల 996 వార్డుల్లో 8వేల 203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16 వేల 31 వేల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయబోతున్నారు. మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన తుది అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతున్నారు. అలాగే ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
మూడు రోజుల పాటు (జనవరి 28, 29, 30 తేదీలలో) నామినేషన్ల స్వీకరణ జరిగింది. మొదటి రోజు 7080 మంది అభ్యర్థులు 7403 నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు 7వేల 980 మంది అభ్యర్థులు 8వేల 326 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) పాటు లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. రేపు స్క్రూట్నీ ఉంటుంది. రిజెక్ట్ అయిన అప్లికేషన్లకు సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన అపీల్ కి వెళ్లొచ్చు. 2వ తేదీన అప్పీల్ కి సంబంధించి డిస్పోజల్ ఉంటుంది. 3వ తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. పోటీలో ఉన్న వారి జాబితా అనౌన్స్ చేస్తారు. 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారం చేసుకోవచ్చు.
Also Read: ఆరూరి రమేష్ తిరిగి కారెక్కింది అందుకేనా? ఆ మాజీ ఎమ్మెల్యేలో కలవరం దేనికి?
