Padi Kaushik Reddy: ఫ్రస్టేషన్లో నోరు జారా, ఇక వదిలేయండి- ఐపీఎస్ల సంఘానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు
సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు తనను అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని వాపోయారు.
Padi Kaushik Reddy Representative Image (Image Credit To Original Source)
- ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కావు
- నన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశారు
- సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే కక్ష సాధిస్తున్నారు
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మతాన్ని ప్రస్తావిస్తూ ఐపీఎస్ అధికారిని దూషించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎక్స్ లో స్పందించారు. ఫ్రస్టేషన్ లో నోరు జారానని వివరణ ఇచ్చారు. ఐపీఎస్ ల సంఘానికి క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్పారు. తన స్వగ్రామం వీణవంకలో జరుగుతున్న సమ్మక్క జాతరకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్న క్రమంలో కొందరు తనను అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని వాపోయారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను, అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు అని కౌశిక్ రెడ్డి వివరించారు. తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు తెలియజేశారు. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరినీ వేడుకున్నారు.
Also Read: పెద్ద ప్లానే..! సడెన్గా దానం నాగేందర్ యూటర్న్.. కారణం అదేనా?
