Corona Variant : జూన్,జులైలో కొత్త వేరియంట్-గాంధీ సూపరింటెండెంట్ రాజారావు

మరి కొద్ది నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు  పుట్టుకు వస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

Corona Variant : మరి కొద్ది నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు  పుట్టుకు వస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కరోనా వైరస్ పుట్టినప్పటి నుంచి చూస్తే ప్రతి ఆరు  నెలలకు ఒకసారి  కొత్త వేరియంట్ పుడుతోందని…ఈ లెక్కన  చూస్తే జూన్, జులైలలో కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

వైరస్ తగ్గుముఖం పడటంతో ప్రజల్లోనిర్లక్ష్యం పెరిగింది అని… వైరస్ పూర్తిగా తొలగిపోలేదన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కొత్త వేరియంట్ రావటం మాత్రం ఖాయం అన్నారు.
Also Read : Corona End: కోవిడ్ – 19 అత్యవసర పరిస్థితికి త్వరలో ముగింపు: డబ్ల్యూహెచ్ఓ
దాని తీవ్రత ఎంతలా ఉంటుందనే అంచనా ఇప్పుడే వేయలేమని రాజారావు అన్నారు. ప్రజలు ఇంకొన్నాళ్ల పాటు మాస్క్ పెట్టుకోవటం భౌతికదూరం పాటించటం శానిటైజర్ వాడటం చేయాలని ఆయన స్పష్టంచేశారు.

ట్రెండింగ్ వార్తలు