Corona End: కోవిడ్ – 19 అత్యవసర పరిస్థితికి త్వరలో ముగింపు: డబ్ల్యూహెచ్ఓ

డబ్ల్యూహెచ్ఓ విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిపుణులతో సంప్రదింపుల అనంతరం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిర్ణయం తీసుకోనున్నారు

Corona End: కోవిడ్ – 19 అత్యవసర పరిస్థితికి త్వరలో ముగింపు: డబ్ల్యూహెచ్ఓ

Who

Corona End: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. గత మూడేళ్ళుగా “కోవిడ్ -19”..కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మృతి చెందారు. కోట్లాది మంది ప్రజలు మహమ్మారి భారిన పడ్డారు. మూడేళ్ళుగా ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 2019లో కరోనా వైరస్ మహమ్మారిగా నిర్ధారణ అవడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. 2020 జనవరి 30న ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఆరోగ్య అత్యవసర స్థితి కారణంగా ఆసుపత్రులు, వైద్యులు, ఇతర ఆరోగ్య రంగ నిపుణులు అలుపులేకుండా శ్రమించారు. అయితే కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ, త్వరితగతిన టీకాలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వచ్చింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Also read: Russia Ukraine War : శరణార్థుల కాన్వాయ్‌ పై రష్యా కాల్పులు..చిన్నారితో సహా ఏడుగురు మృతి

ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ప్రజారోగ్య నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 సంక్షోభానికి ఎలా, ఎప్పుడు ముగింపు పలకాలనే దానిపై చర్చిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో తూర్పు ఆసియాలోనూ, మరికొన్ని ఐరోపా దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ – 19 అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలా? లేదా? అనే సందేహంలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. గ్లోబల్ గా చాలా చోట్ల కేసులు తగ్గినప్పటికీ, ఈ వారంలో చైనాలో 3000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. చైనా రోజు వారి కేసులలో గత రెండేళ్లలోనే అత్యధిక కేసులు ప్రస్తుతం నమోదు అవుతున్నాయి. ఇక హాంకాంగ్‌లోనూ కరోనా మరణాలు పెరిగాయి.

Also read: Corona : చైనా, హాంకాంగ్‌, సౌత్‌ కొరియా, వియత్నాంలో కరోనా విలయం

గత మూడేళ్ళుగా కరోనాతో సహజీవనం చేసిన ప్రపంచ దేశాలు ప్రస్తుతం WHO మార్గదర్శకాలను పాక్షికంగా పాటిస్తూ తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మాస్క్ ధరించడం సహా ఇతర కరోనా మార్గదర్శకాలను సడలించి అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తి అనుమతి ఇస్తున్నాయి. ఈక్రమంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితికి ముగింపు పలకడానికి WHO చర్యలు తీసుకుంటుంది. ఎమర్జెన్సీ ప్రకటన మాదిరిగానే, నిపుణులతో సంప్రదింపుల అనంతరం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉంటే కోవిడ్ -19 కేసులు కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, మలేరియా, క్షయ వంటి ఇతర అనారోగ్యాల మాదిరిగా ఏటా వేలాది మంది కరోనా ప్రభావంతో చనిపోయే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు