Corona : చైనా, హాంకాంగ్‌, సౌత్‌ కొరియా, వియత్నాంలో కరోనా విలయం

చైనాతో పాటు హాంకాంగ్‌, సౌత్‌ కొరియా, వియత్నాంలో కూడా కోవిడ్‌ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

Corona : చైనా, హాంకాంగ్‌, సౌత్‌ కొరియా, వియత్నాంలో కరోనా విలయం

Corona (1)

Corona in China : చైనాలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్‌చున్‌లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్‌చున్‌లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్‌ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ నగరాలకు విస్తరిస్తుండడంతో కఠిన ఆంక్షలు విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చైనాలో దాదాపు రెండేళ్ల తర్వాత మొదటిసారిగా రోజుకూ 1000 కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా వాసులు ఇంట్లోనే ఉండాలని.. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఇక చాంగ్‌చున్‌లో కూడా వ్యాపార సముదాయాలను మూసివేశారు. దీంతో పాటు ప్రజలందరూ టెస్టులు చేయించుకోవాలన్నారు.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

షాంఘైలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో స్కూళ్ల నుంచి కాలేజీల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇక చైనాతో పాటు హాంకాంగ్‌, సౌత్‌ కొరియా, వియత్నాంలో కూడా కోవిడ్‌ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. సౌత్‌కొరియాలో శనివారం అత్యధికంగా 3 లక్షల 83 వేల 665 కేసులు నమోదయ్యాయని కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ వెల్లడించింది.

అంతేకాకుండా 229 మంది మృతి చెందారని తెలిపారు. దాదాపు రెండేళ్ల తర్వాత సౌత్‌ కొరియాలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 10 లక్షలు దాటిపోయింది. మరోవైపు వియత్నాంలోనూ ఒమిక్రాన్‌ వేరియంట్ కోరలు చాస్తోంది. అక్కడ మార్చి 9 నుంచి ప్రతి రోజూ దాదాపు రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి…. ఇటు హాంకాంగ్‌లోనూ కరోనా మరోసారి భయపెడుతోంది. తాజాగా 27 వేల 647 కేసులు నమోదయ్యాయి.