Motkupalli
Motkupalli Narasimhulu : అచ్చె దిన్ కాదు… సచ్చే కాలం బీజేపీ తెస్తోందని, ధాన్యం కొనుగోలు ఎప్పటి నుంచో కేంద్రం చేస్తోందన్నారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా వాగుతున్నారని, సీఎం కేసీఆర్ కు తాము అండగా ఉంటామన్నారు. గత కొన్ని రోజులుగా వరి ధాన్యం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి..బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పలు డిమాండ్స్ విసిరారు. ఈ క్రమంలో…2021, నవంబర్ 10వ తేదీ బుధవారం ఉదయం మీడియాతో మోత్కుపల్లి మాట్లాడారు.
Read More : TTD LAC in Delhi : గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే
దళితబంధు వద్దని డప్పు కొట్టేలా బీజేపీ నేతల తీరు ఉందని, దళిత పథకాలను అడ్డుకుంటే….వారిని క్షమించరని వ్యాఖ్యానించారు. వాసలమర్రిలో డబ్బులు వేయలేదా వస్తే తాను చూపిస్తానని, దళిత బంధును అడ్డుకుంటే…గ్రామాల్లో ఆ పార్టీలకు దళితులు పాతర వేస్తారన్నారు. దళిత బంధును అడ్డుకుంటే గ్రామాల్లోకి బీజేపీ నేతలను రానివ్వమని హెచ్చరించారు. బీజేపీకి దమ్ముంటే దేశ వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read More : zika virus effect in UP: యూపీలో 100కు చేరిన జికా వైరస్ కేసులు
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో సంజయ్ చెప్పాలని, దేశంలో దళితులను బతకకుండా చేస్తున్నారని విమర్శించారు. పెట్రో ధరలను పెంచిన బీజేపీ ప్రభుత్వమే వాటిని తగ్గించాలన్నారు. హుజురాబాద్ లో గెలుపు కాదు….బలుపుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ను ఉప ఎన్నికల్లో ఈటలకు రేవంత్ అమ్ముకున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రాజీనామా చేయాలని, అవకాశం వస్తే సోనియా కుటుంబాన్నీ రేవంత్ అమ్మేస్తారని విమర్శించారు. బలం ఉంటే సాగర్ లో ఎందుకు గెలువలేదు ? కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తు హుజురాబాద్ లో ఉందన్నారు మోత్కుపల్లి.