TTD LAC in Delhi : గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే

స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

TTD LAC in Delhi : గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే

Ttd (1)

Vemireddy Prashanthi Reddy : గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లేనని, మాట ప్రకారం పని చేస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గోవు ఆధారిత వ్యవసాయాన్ని సైతం ప్రోత్సహించాలని నిర్వహించినట్లు, వివిధ పీఠాధిపతుల ఆధ్వర్యంలో గో మహాసమ్మేళనం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆలయాలకు ఆవు దూడను ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు..ఇప్పటికే వంద ఆలయాలకు ఇచ్చామన్నారు. 2021, నవంబర్ 10వ తేదీ బుధవారం స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

Read More : zika virus effect in UP: యూపీలో 100కు చేరిన జికా వైరస్ కేసులు

అనంతరం ఆలయంలో గో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల విస్తరిస్తున్నట్లు, సేవల విస్తరణ కోసం ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ పని చేస్తుందన్నారు. ఉత్తరాదిన ఢిల్లీ, కురుక్షేత్ర సహా మరికొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయని, జమ్మూలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన ఇప్పటికే జరిగిందన్నారు. ఇందుకు టెండర్లు పిలిచినట్లు, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Read More : Pak CJ Gulzar Ahmed : పాకిస్థాన్ లోని హిందువులకు అండగా ఉంటాం : పాక్ ప్రధాన న్యాయమూర్తి

అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీని స్థలం కేటాయించాలని కోరడం జరిగిందని, ఆలయమో, భజన మందిరమో నిర్మించాలని భావిస్తున్నామన్నారు. కానీ.. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. ఢిల్లీలో టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ గా భాద్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు, ఢిల్లీలో స్వామి వారి భక్తుల సౌకర్యాల కోసం తన వంతు కృషి చేస్తానని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.