కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే సాగుతోంది: ఎంపీ ధర్మపురి అరవింద్

"పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించేందుకు కొందరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందూరుకే ఆ బోర్డు వస్తుంది" అని చెప్పారు.

MP Arvind

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే సాగుతోందని, ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేట్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకుని సర్వే పూర్తి చేయాలని అన్నారు.

ఆర్వోబీ, అర్‌యూబీకి సంబంధించిన బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించకుండా కాంట్రాక్టర్లకు చెల్లించాలని చెప్పారు. కాంగ్రెస్ ఏడాదిగా ఎన్నో అబద్ధాలు ఆడుతోందని అన్నారు. ఇచ్చిన హామీలు ఏమైపోయాయని నిలదీశారు. 75 శాతం తన నియోజకవర్గం రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు.

“పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించేందుకు కొందరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందూరుకే ఆ బోర్డు వస్తుంది. తెలంగాణను దోచుకున్న వ్యక్తి కేసీఆర్. కాళేశ్వరానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. అప్పుడే క్రాక్స్ వచ్చాయి. పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రజలకు పనికి వచ్చే రాజకీయాలు చేయడం లేదు.

తెలంగాణ ప్రజలను దోచుకున్న ముఠా కేసీఆర్ కుటుంబం. రేవంత్ రెడ్డి గ్రామాలకు వెళ్లాలి, ఆయన ఏం శాఖపైనా రివ్యూ చేయడం లేదు. ఎన్నికలు వస్తే ప్రజలు కాంగ్రెస్ భరతం పడతారు. జేసీబీలు ఓల్డ్ సిటీలోకి ఎందుకు పోవడం లేదు? మూసీ ప్రక్షాళన చేయాలి.. చెరువులను పునరుద్ధరించాలి” అని ధర్మపురి అరవింద్ అన్నారు.

Minister Narayana: గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వదిలేసింది: మంత్రి నారాయణ