Mp Komatireddy
MP Komatireddy : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం టీపీసీసీ అంశమై విలేకరులతో మాట్లాడుతూ …..రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు..పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి..రేవంత్ రెడ్డికి గురించి నా దగ్గర మాట్లాడవద్దు అని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పా.. నియోజక వర్గ అభివృద్ధి పైనే దృష్టి సారించానని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్ధవంతమైన నాయకుడు లేడని..నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధి పై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. నా నియోజకవర్గ ప్రజలకు,నా జిల్లాకు ,తెలంగాణకి అందుబాటులో ఉంటానని చెప్పిన కొమటి రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతన్న కోమటిరెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.
కిషన్ రెడ్డి మొదటి నుంచి వివాద రహితుడు..సౌమ్యుడని అనేక సంవత్సరాలు కలిసి పనిచేసాం అని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ పెండింగ్ అంశాలు పూర్తి చేసేందుకు సహకరించాలని,మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డిని కోరానని కోమటి రెడ్డి వెంకట రెడ్డి చెప్పారు.