Komati Reddy Venkat Reddy: నల్గొండలో ప్రియాంక గాంధీ సభ.. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పా..

జగదీశ్వర్ రెడ్డి హైట్ ఎంత ఉంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు. నేను, శ్రీధర్‌బాబు ఎలా ఉన్నాం? జగదీష్ రెడ్డి ఎలా ఉన్నాడు? మేం ప్రజల నుండి వచ్చిన నాయకులం. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Jupally Krishna Rao

Komati Reddy Venkat Reddy: ఈనెల 18 లేదా 19 తేదీల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని, ప్రియాంక సభ తరువాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆయన నివాసంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన వరుసగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే మల్లు రవితో భేటీ అయిన జూపల్లి ఆదివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడాపాల్గొన్నారు.

Jupally Krishna Rao: కాంగ్రెస్ ముఖ్యనేతలతో జూపల్లి వరుస భేటీలు.. పార్టీలో చేరిక ఎప్పుడంటే..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వచ్చినా.. మీడియా ఉండటంతో ఆగకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. కోమటిరెడ్డితో భేటీ అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. కేవలం టీతాగడానికి మాత్రమే కోమటిరెడ్డి దగ్గరికి వచ్చానని తెలిపారు. ఏ పార్టీలో చేరుతానో ఇంకా డిసైడ్ అవ్వలేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని, ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో చూస్తారని అన్నారు. షర్మిల విషయంపై విలేకరుల ప్రశ్నించగా.. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచిదేనని అన్నారు.

Jupally, Ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్.. క్లారిటీ ఇచ్చిన నేతలు

జూపల్లి కృష్ణారావు, నేను పాత మిత్రలం. కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పాను అని వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగదీశ్వర్ రెడ్డి హైట్ ఎంత ఉంది? ఆయన ఎం మాట్లాడుతున్నాడు. నేను శ్రీధర్‌బాబు ఎలా ఉన్నాం? జగదీష్ రెడ్డి ఎలా ఉన్నాడు? మేం ప్రజల నుండి వచ్చిన నాయకులం. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు అంటూ ఘాటుగా విమర్శించారు. మా ప్రభుత్వం రాగానే ప్రజాదర్భార్ నిర్వహిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Jupally Ponguleti : వీడిన సస్పెన్స్.. కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. షర్మిల, డీకే శివకుమార్ వ్యక్తిగత పరిచయంతో కలిశారు. చేరికల విషయంలో అదిష్టానందే ఫైనల్. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ లేదని కేసీఆర్ ప్రచారం చేశారు. క్షేత్ర స్థాయిలో మా బలం చూసి కేసీఆర్ భయపడుతున్నారు అని అన్నారు.