Telangana Congress : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ? సోమవారం ప్రకటన!

పదవి కోసం పోటీపడుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు కొందరికి మాత్రమే ఫోన్లు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారికి మాత్రమే ఫోన్‌ చేసి...కొత్త పీసీసీ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నందున ఏ ఒక్కరూ కామెంట్స్ చేయకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం.

Tpcc

TPCC Chief : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందా..? పీసీసీ కొత్త బాస్ పేరు ప్రకటించేందుకు అధిష్టానం రెడీగా ఉందా ? ఇంతకీ టీపీసీసీ కొత్త చీఫ్‌ ఎవరు? పదవి ఎవరిని వరించబోతుంది.? అధిష్టానం పార్టీ నేతలకు ఏం సూచించింది. సడెన్‌గా టీపీసీసీ నేతలు సైలెంట్ ఎందుకయ్యారు.?

టీపీసీసీ అధ్యక్షుడి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎంపిక విషయంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎంపిక విషయంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం తారాస్థాయికి చేరింది. ఒకరిపైఒకరు ఫిర్యాదులతో పీసీసీ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో బాస్‌ ఎంపిక విధానంలో ఎడతెగని జాప్యం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ఒకరిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

పదవి కోసం పోటీపడుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు కొందరికి మాత్రమే ఫోన్లు చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారికి మాత్రమే ఫోన్‌ చేసి…కొత్త పీసీసీ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నందున ఏ ఒక్కరూ కామెంట్స్ చేయకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రేవంత్ ఎంపిక దాదాపు ఖరారైందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అసంతృప్తిగా ఉంటున్న సీనియర్లను ఇప్పటికే బుజ్జగించారు. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు సీనియర్లు, అసంతృప్తులతో మాట్లాడుతూ కొన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారట. త్వరలో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధిష్టానం ప్రకటించబోతుంది. కాబట్టి ఏ ఒక్కరూ బహిరంగంగా కామెంట్స్ చేయడానికి వీలు లేదంటూ దిశానిర్దేశం చేశారట. దీంతో కాస్త నోరు చేసే నేతలందరూ సైలెంట్ అయిపోతున్నారు.