Munugode Bypoll Polling : 3వేల మంది పోలీసులు, 20 కేంద్ర బలగాలు.. మునుగోడులో పోలింగ్‌కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.

Munugode Bypoll Polling : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన, హీట్ పెంచిన అంశం మునుగోడు ఉపఎన్నిక. మునుగోడులో ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 6గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడింది. ఎల్లుండే (నవంబర్ 3) పోలింగ్. దీంతో మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.

క్యాంపెయిన్ ముగియడంతో ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉందంటూ ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మద్యం, డబ్బు పంపిణీ ఇతర ప్రలోభాలను అరికట్టేందుకు 50 ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ను నియమించింది ఈసీ. అలాగే మునుగోడులో వంద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 3వేల 366 మంది పోలీసులతో పాటు 20 కేంద్ర బలగాలు మోహరించారు.

మరోవైపు 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2లక్షల 41వేల 855మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మునుగోడు ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచించాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ప్రచారంలో దూసుకెళ్లాయి.

దాదాపు రెండు నెలలుగా మునుగోడు ప్రాంతం హోరెత్తింది. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా అంటే ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి కూడా అన్ని పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ప్రచారం గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులెవరూ మునుగోడులో ఉండొద్దని ఈసీ ఆదేశించింది. దీంతో చాలామంది మునుగోడు నియోజకవర్గాన్ని వీడారు. నవంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ.. అక్కడ వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను పెట్టడం జరిగింది. అలాగే ఆ ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరించడం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు