Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు

ఈ కోవలోనే ఓ ముస్లిం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పది మందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు విరాళాలు సేకరించి.. గ్రామంలో రామాలయం నిర్మించారు.

Religious harmony : మన దేశం భిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు నిలయం. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందూ- ముస్లిం భాయీభాయీ.. నినాదం ఎప్పటి నుంచో కార్యరూపం దాల్చింది. హిందూ దేవుళ్లకు ముస్లింలు కానుకలు సమర్పిస్తుంటారు. భద్రాచలం రాములోరికి తానీషా పట్టవస్త్రాలు, తలంబ్రాలు పంపేవారు. ఉగాదికి కడప వెంకటేశ్వరస్వామికి ముస్లింలు దర్శించుకుని పూజలు చేస్తారు.

ఈ కోవలోనే ఓ ముస్లిం పెద్ద మనసు చేసుకొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. పది మందికి పనికొచ్చే పనిచేయడానికి ఏ మతమూ అడ్డురాదని నిరూపించారు. తన సొంత డబ్బులతో పాటు విరాళాలు సేకరించి.. గ్రామంలో రామాలయం నిర్మించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు సర్పంచ్‌ షేక్‌ మీరాసాహెబ్‌ రామాలయం నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు

బూడిదంపాడులో చెట్ల కింద సీతారాముల విగ్రహాలు ఉండేవి. శ్రీరామనవమికి పందరివేసి కల్యాణం నిర్వహించేవారు. రామాలయం నిర్మించేందుకు ఎవరూ ముందుకాలేదు. దీంతో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఊళ్లో రామాలయం నిర్మిస్తాని షేక్‌ మీరాసాహెబ్‌ హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తన హామీని అమలు చేశారు.

రామాలయం నిర్మాణం కోసం 50 లక్షలు వెచ్చించారు. ఈ మొత్తంలో 25 లక్షలను సొంతంగా భరించారు. మరో 25 లక్షలను గ్రామస్తుల నుంచి విరాళంగా సేకరించారు. ముగ్గురు దాతలు వెయ్యి గజాల భూమిని విరాళంగా ఇచ్చారు. దీంతో అద్భుత ఆలయం నిర్మించి భక్తులకు షేక్‌ మీరాసాహెబ్‌ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు