Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు

బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర పేరుతో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో రాముడు, హనుమాన్‌ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు.

Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు

Religious Harmony : దేశంలో ఒకవైపు మతకలహాలు కొనసాగుతుంటే మరోవైపు మతసామరస్యం వెల్లివిరిసింది. మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని మరోసారి నిరూపించారు. సొంత మతంపై అభిమానం కల్గివుండటమే కాదు ఇతర మతాలను కూడా గౌరవించాలనే భావన కల్పించారు. తమ మత ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే ఇతర మతాల పట్ల కూడా ఆదరాభిమానాలు చూపాలనే సందేశం ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని మరోసారి చూపించారు.

కరీంనగర్‌ జిల్లాలో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో అరుదైన దృశ్యం కనిపించింది. రాముడి విగ్రహంపై ముస్లిం సోదరులు పూల వర్షం కురిపించారు. బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర పేరుతో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో రాముడు, హనుమాన్‌ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు. ఈ యాత్ర రాజీవ్‌ చౌక్‌ వద్దకు చేరుకోగానే.. ముస్లింలు బిల్డింగ్‌ పైనుంచి రాముడి విగ్రహంపై పూల వర్షం కురిపించారు. ఈ దృశ్యం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

Iftar In Temple : వెల్లివిరిసిన మతసామరస్యం.. ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

గతంలో కూడా దేశంలోని పలు చోట్ల గణేష్ నిమజ్జన శోభయాత్రతోపాటు పలు హిందువుల పండుగల సందర్భంగా ముస్లీం సోదరులు సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ శోభయాత్ర సందర్భంగా పాతబస్తీతోపాటు పలు ప్రాంతాల్లో హిందువులకు ముస్లీం సోదరులు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్న సందర్భాలను చూస్తుంటాం.

అలాగే హిందువులు కూడా రంజాన్ తోపాట పలు ముస్లీం పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. తెలంగాణలో ఇప్పటికీ మొహర్రం పండుగను హిందువులు, ముస్లీంలు కలిసి జరుపుకునే ఆనవాయితీ ఉంది. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెబుతుంటారు. ఈ విధంగా ఒకరి మతాలను మరొకరు గౌరవించుకోవడం వల్ల మనుషుల మధ్య భేదాభిప్రాయలు రాకుండా కలిసి మెలిసి జీవించడానికి దోహదపడుతుంది.