Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు..

ఉగ్రవాదం, ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని

AP Deputy CM Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు అందింది. పవన్ పై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్లిం నాయకులు. ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ముస్లిం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: నిద్రపోతున్న పాకిస్థాన్.. అప్పుడు అమెరికా, ఇప్పుడు ఇండియా.. వాళ్ల భూభాగంలోకి వెళ్లి మరీ ఇలా లేపేశారు..

ఉగ్రవాదం, ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని, ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని వారు అన్నారు. ముస్లింలు, వారి గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ఫ్‌ పై పవన్ వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు.