నిద్రపోతున్న పాకిస్థాన్.. అప్పుడు అమెరికా, ఇప్పుడు ఇండియా.. వాళ్ల భూభాగంలోకి వెళ్లి మరీ ఇలా లేపేశారు..
పాక్‌లో రాత్రి సమయంలో అప్పట్లో అమెరికా ఏం చేసింది?

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్‌ను పాకిస్థాన్ నిద్రపోతున్న వేళ భారత్ చేపట్టింది. భారత్ ఏదో ఒక సమయంలో దాడి చేయనుందని పాక్‌కు తెలుసు. అయినప్పటికీ బీరాలు పలకడం తప్ప భారత్ దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. హాయిగా మొద్దు నిద్రపోతూ భారత్ దాడి చేసిన అనంతరం కళ్లు తెరిచింది.
భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి అమాయకుల ప్రాణాలు తీస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గత రాత్రి నిద్రలేకుండా చేసింది. అలాగే, భారత్ త్వరలోనే మరో దాడి చేస్తుందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. గతంలో అమెరికా కూడా పాకిస్థాన్‌లో రాత్రి సమయంలోనే ఆపరేషన్ చేపట్టింది. 9/11 దాడుల సూత్రధారి, అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టింది. అప్పట్లో పాక్‌లో అమెరికా, ఇప్పుడు భారత్ సమర్థవంతంగా దాడులు చేపట్టిన తీరు గురించి తెలుసుకుందాం..
Also Read: ఇండియా రాఫెల్ vs పాకిస్థాన్ ఎఫ్ 16.. ఏ యుద్ధ విమానం సత్తా ఎంత?
ఆపరేషన్ సిందూర్: 9 టార్గెట్లు, 25 నిమిషాల సమయం
భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని పంజాబ్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. జైష్, లష్కర్ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ఉన్న పంజాబ్‌లో నాలుగు టార్గెట్లను భారత్ ఛేదించింది. పీవోకేలోని ఐదు ఉగ్రవాద శిబిరాలను కూడా ధ్వంసం చేసింది.
మంగళవారం అర్ధరాత్రి దాటాక 25 నిమిషాల్లో తొమ్మిది ప్రాంతాల్లో 21 స్ట్రైక్‌లు జరిగాయి. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 1.30 గంటల సమయంలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు.
పాక్‌లో రాత్రి సమయంలో అప్పట్లో అమెరికా ఏం చేసింది?
అది 2011, మే 2.. పాక్‌లో నక్కి నక్కి దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ లక్ష్యంగా అమెరికా “ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్” నిర్వహించింది. దీనిలో అమెరికా దళాలకు చెందిన “సీల్ టీమ్ సిక్స్” ఒసామా బిన్ లాడెన్‌ను దాక్కున్న అబోటాబాద్‌లోని వజీరిస్థాన్ హవేలీలోకి చొచ్చుకెళ్లింది.
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను స్థాపించి.. అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు సూత్రధారిగా ఉన్న లాడెన్‌పై “సీల్ టీమ్ సిక్స్” బుల్లెట్ల వర్షం కురిపించి హతమార్చింది. అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా సైన్యం లాడెన్ కోసం వెతికింది. అతడు పాకిస్థాన్‌కు పారిపోయి అబోటాబాద్‌లోని ఓ ఇంట్లో దాక్కున్నాడు.
అతడిని పట్టుకునే మిషన్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. దాదాపు 24 నేవీ సీల్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వారు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో ప్రయాణించారు. ఈ మిషన్ అఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్ నుంచి ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్ లక్ష్యంగా జరిగిన దాడికి సంబంధించిన ఆపరేషన్ 40 నిమిషాలు కొనసాగింది. 2011, మే 2న తెల్లవారుజామున ఒంటి గంటకు బిన్ లాడెన్ హతమయ్యాడు.