Muthireddy Yadagiri: ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తూ ఎందుకు మాట్లాడారు?: సొంత పార్టీ నేతపై ముత్తిరెడ్డి ఆగ్రహ జ్వాల

ఇతర పార్టీల నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

Palla Rajeshwar Reddy -Muthireddy Yadagiri

Muthireddy Yadagiri – Palla Rajeshwar Reddy: తెలంగాణ(Telangana)లోని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ జనగామ నుంచి బీఆర్ఎస్ టికెట్ కోసం వారిద్దరూ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అదే చేస్తామని అంటూనే వారిద్దరు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో జనగామ అభ్యర్థిగా ఎవరి పేరునూ ప్రకటించలేదు.

ఇవాళ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించి మాట్లాడటం సరికాదని అన్నారు. మదమెక్కి పైసలు పంచుతున్నారని ఆరోపించారు.

ఇతర పార్టీల నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. వారిని కుక్కలంటూ సంబోధించడం తప్పని హితవు పలికారు. ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాణాలు చెప్పాలని అన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గానే తీసుకుంటామని చెప్పారు.

జనగామకు చాలా చరిత్ర ఉందని, అప్పట్లో సీఎం అభ్యర్థిని, బలమైన నాయకుడిని ఓడగొట్టిన చరిత్ర తనదని అన్నారు. తెలంగాణలో ఏ గడ్డ నుంచి ఏ మనిషి ఎలాంటి వాడో కేసీఆర్ కి తెలుసని అన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీని తాను సాధిస్తానని అన్నారు.

CM KCR: తుమ్మల ఎఫెక్ట్..! ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ పిలుపు ..