మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్, పల్లె చెరువు కట్ట తెగే అవకాశం, జాగ్రత్తగా ఉండాలంటూ..పోలీసుల హెచ్చరికలు

  • Publish Date - October 15, 2020 / 11:18 AM IST

Mylar Dev Palli High Tension : మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్లెచెరువు నిండిపోయింది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అక్కడకు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.



మైక్ ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేపడుతున్నారు.



పల్లె చెరువు కు వెళ్లే రహదారికి బీటలు పడ్డాయి. జల్ పల్లి, ఇతర ప్రాంతాల నుంచి వరదవ నీరు పోటెత్తడంతో చెరువు నిండుకుండలా తయారైంది. హైటెన్షన్ స్తంభాలు నేలకొరిగాయి. బండ్లగూడ, ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట, అరుంధతి కాలనీతో పాటు తదితర ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది. ఎవరూ కూడా బయటకు రావొద్దని వెల్లడిస్తున్నారు.



చెరువుకు సమీపంలో ఉన్న కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణ నష్టం జరుగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి.
వరద ముంపు నుంచి హైదరాబాద్‌ నగరం ఇప్పుడే కోలుకునేలా లేదు. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిముంపులోనే ఉండిపోయాయి.



సరూర్‌నగర్‌ చెరువు కట్ట తెగడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 36గంటలకు పైగా కాలనీలు నీటిలో నానుతున్నాయి. నిత్యావసరాలు కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



వరద ముంపు నుంచి హైదరాబాద్‌ నగరం ఇప్పుడే కోలుకునేలా లేదు. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిముంపులోనే ఉండిపోయాయి. సరూర్‌నగర్‌ చెరువు కట్ట తెగడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 36గంటలకు పైగా కాలనీలు నీటిలో నానుతున్నాయి. నిత్యావసరాలు కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు