MLC Election Vote Counting : మందకొడిగా నల్గొండ – వరంగల్‌ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

MLC Election Vote Counting : నల్గొండ – వరంగల్‌ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకూ నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 4వ రౌండ్‌ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 15వేల 442 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15 వేల 898 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 12వేల 146 ఓట్లు, కోదండరామ్‌కు 10వేల 48 ఓట్లు వచ్చాయి.

నాలుగో రౌండ్‌ ముగిసే సరికి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 63వేల 443 ఓట్లు వచ్చాయి. తీన్మార్‌ మల్లన్నకు 48వేల 4, కోదండరామ్‌కు 39వేల 615 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో… పల్లా రాజేశ్వర్ రెడ్డికి 16వేల 130 ఓట్లు రాగా.. తీన్నార్‌ మల్లన్నకు 12వేల 46, కోదండరాంకు 9వేల 80, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6వేల 615 ఓట్లు వచ్చాయి.

ఇక రెండో రౌండ్‌లో.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15వేల 857, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12వేల 70, టీజేఎస్‌ అభ్యర్థి కోదండరామ్‌కు 9వేల 448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6వేల 669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3వేల 244 ఓట్లు పోలయ్యాయి. ఇక మూడో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15వేల 558 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 11వేల 742, టీజేఎస్ అభ్యర్థి ప్రొ.కోదండరామ్‌కు 11వేల 39, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 5వేల 320, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4వేల 333 ఓట్లు పోలయ్యాయి.

మూడో రౌండ్‌లో పల్లాకు 3వేల 816 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో మూడు రౌండ్లు ముగిసే సమయానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 47వేల 545, తీన్మార్‌ మల్లన్నకు 35వేల 858, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కు 29వేల 560 ఓట్లు పోలయ్యాయి. 58 మంది అభ్యర్థులకు 3 రౌండ్లలో కలిపి వంద ఓట్లు కూడా రాలేదు. ఇంకా నాలుగు రౌండ్లు లెక్కించాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు