Nampally Fire Broke out
Nampally Fire Broke out : హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో 21 మందిని రక్షించామని ఫైర్ మెన్ ఆదర్శ్ పేర్కొన్నారు. సమాచారం వచ్చిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని రెండు, మూడు అంతస్తుల్లో ఉన్నవారిని రిస్క్యూ చేశామని చెప్పారు. తమ చేతులతో 21 మందిని రక్షించామని తెలిపారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్ కి తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
రెండో అంతస్తులో ఉన్న 6 మంది పొగపీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లారని పేర్కొన్నారు. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా అలుముకున్నాయని తెలిపారు.
పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశామం కానీ, కానీ దురదృష్టశాత్తు ప్రాణాలు పోయారని పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించామని తెలిపారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. బజార్‌ఘాట్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న స్టోరేజీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంట్లలో చిక్కుకున్న చిన్నారి, మహిళను రెస్యూ టీమ్ ధైర్యంగా రక్షించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడారు.
Fire Broke Out : హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు.