Nampally Fire Broke Out : నాంపల్లి అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారి, మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్

బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది.

Nampally Fire Broke Out : నాంపల్లి అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారి, మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్

Daring rescue (1)

Updated On : November 13, 2023 / 2:23 PM IST

Nampally Fire Broke Out : హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. బజార్‌ఘాట్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న స్టోరేజీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంట్లలో చిక్కుకున్న చిన్నారి, మహిళను రెస్యూ టీమ్ ధైర్యంగా రక్షించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడారు.  బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ గోదాం ఉంది. అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు. కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, మూడు ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పివేశారు.

Fire Broke Out : హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి

మొదట కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆ తర్వాత అపార్ట్ మెంట్ లోకి మంటలు వ్యాపించాయని డీసీపీ పేర్కొన్నారు. జీ+4 బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో డీజల్ డ్రమ్ముల్లో మంటలు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కార్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, మరో ముగ్గురుకి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు.

మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. కొందరు మంటల్లో సజీవ దహనం కాగా, మరికొందరు ఊపిరాడక చనిపోయినట్లు నిర్ధారణ అయింది. డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు 15 మందిని రక్షించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఎనిమిది మంది చికిత్స పొందతున్నారు.