Nampally Court : గంజాయి స్మగ్లర్లకు 20 ఏళ్ల జైలుశిక్ష

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గంజాయి తరలిస్తూ పట్టుబడితే ఇక జీవితాంతం చిప్పకూడు తినాల్సిందేనంటూ హెచ్చరించింది.

Nampally Court : గంజాయి పెడ్లర్లకు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు షాక్‌ ఇచ్చింది. గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కృషి చేస్తుండగా.. గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గంజాయి తరలిస్తూ పట్టుబడితే ఇక జీవితాంతం చిప్పకూడు తినాల్సిందేనంటూ హెచ్చరించింది.

హైదరాబాద్‌ అంబర్‌పేటలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడిన ఇద్దరికి.. ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2020 నవంబర్‌లో పెద్దఅంబర్‌పేట వద్ద పదమూడు వందల 35 కిలోల గంజాయిని.. డీఆర్‌ఏ అధికారులు సీజ్‌ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న మహ్మద్‌ హమీద్‌, రామేశ్వర్‌లను అరెస్టు చేశారు.

Cannabis Cultivate : ములుగు జిల్లాలో గంజాయి కలకలం.. మిర్చి తోటలో గుట్టుచప్పుడు కాకుండా సాగు

ఆ ఇద్దరిపై NDPS యాక్టు కింద డీఆర్‌ఐ అధికారులు కేసు నమోదు చేశారు. లారీ నెంబర్ ప్లేట్ మార్చేసి.. భారీగా గంజాయి తరలించిననట్టు కోర్టుకు తెలిపారు DRI అధికారులు. ఈ కేసును విచారించిన నాంపల్లి మెట్రోపాలిటన్‌ కోర్టు.. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ హమీద్‌, రామేశ్వర్‌కు ఏకంగా 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

ట్రెండింగ్ వార్తలు