Cannabis Cultivate : ములుగు జిల్లాలో గంజాయి కలకలం.. మిర్చి తోటలో గుట్టుచప్పుడు కాకుండా సాగు

రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాగు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Cannabis Cultivate : ములుగు జిల్లాలో గంజాయి కలకలం.. మిర్చి తోటలో గుట్టుచప్పుడు కాకుండా సాగు

Cannabis

Cannabis Cultivate : ములుగు జిల్లాలోని దేవగిరిపట్నంలో గంజాయి కలకలం రేపుతోంది. పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారు. మిర్చి తోటలో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాగు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ములుగు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గంజాయి సాగు కలకలం రేపుతోంది.

ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు గంజాయికి సంబంధించిన ఆనవాళ్లు లేవనుకున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఒక్కసారిగా మిర్చి తోటలో అంతర్ పంటగా గంజాయిని సాగు చేయడం కనిపించింది. మిర్చి మొక్కల మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. మిర్చి మధ్యలో గంజాయి మొక్కలు దర్శనమివ్వడం, పక్కా సమాచారంతో పోలీసులు గుర్తించారు. ఇది ములుగు జిల్లాలో హాట్ టాపిక్ గా సాగుతోంది. ములుగు ఏఎస్పీ సుధీర్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.

Kodada : గంజాయికి బానిసైన కొడుకుని కట్టేసి, కళ్లలో కారం కొట్టిన తల్లి

అయితే ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసు శాఖ అలర్ట్ అయింది. ఈ మేరకు గంజాయి సాగు చేస్తున్న పంట పొలాలపై దాడులు చేశారు. పట్టుబడిని మొత్తం గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లాలో గంజాయి సాగుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని చెబుతున్న సందర్భంలో ఇప్పుడు గంజాయి సాగు బయటపడటం కలకలం రేపుతోంది.