Site icon 10TV Telugu

Navdeep: మానసిక ఒత్తిడికి గురవుతున్నా.. నా సినీ కెరీర్‌పై..: డ్రగ్స్ కేసుపై హీరో నవదీప్

Navdeep – Drugs Case

Navdeep – Drugs Case: మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ టాలీవుడ్ హీరో నవదీప్ తెలంగాణ హైకోర్టుకు పిటిషన్ లో తెలిపాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పిటిషన్ కాపీలో నవదీప్ పలు వివరాలు తెలిపాడు. డ్రగ్స్ కేసులో తాజాగా పోలీసులు చేసిన ప్రకటనపై ఆయన అభ్యంతరాలు తెలిపాడు. తాను డ్రగ్స్ వినియోగదారుడిని కాదని అన్నాడు. తాను వాటిని తీసుకున్నాననడానికి ఎలాంటి వైద్యపర ఆధారాలూ లేవని తెలిపాడు.

పోలీసులు ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తాను పరారీలో ఉన్నట్టు మీడియాకు తెలిపారని అన్నాడు. తన గురించి తప్పుడు ప్రకటన చేశారని తెలిపాడు. దీంతో తాను మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నానని చెప్పాడు. పోలీసులు చేసిన ప్రకటన ద్వారా తన కెరీర్ పై ప్రభావం పడుతుందని అన్నాడు. ఈ కేసులో కస్టోడియల్ దర్యాప్తు కూడా అవసరం లేదని నవదీప్ చెప్పాడు. కాగా, నవదీప్ వ్యవహారంపై అనేక రకాల కథనాలు వస్తున్నాయి.

Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

Exit mobile version