Hyderabad Neera Cafe : స్టార్‌ హోటల్ని తలపించేలా నీరా కేఫ్‌ .. ప్రత్యేకతలేంటో తెలుసా..?

హైదరాబద్ సాగరతీరంలో చిల్ అయ్యేలా నీరా కేఫ్.. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుచే నీరా కేఫ్ తెలంగాణ సంప్రదాయం, సంస్కృతిక, ఆధునికతతో గౌడ్ ల ఆత్మగౌవరం పెంచేలా నీరా కేఫ్ ను నిర్మించారు.

Hyderabad Neera Cafe

Hyderabad Neera Cafe : తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్దమైన నీరాను అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. హైదరాబాద్ నడి బొడ్డున నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ద్వారా స్వచ్ఛమైన, ప్రకృతి సిద్దమైన నీరాను అందించనుంది. రూ.12 కోట్ల 20 లక్షల రూపాయల వ్యవయంతో స్టార్ హోటల్ ను తలపించేలా నీరా కేఫ్ ను నిర్మించింది ప్రభుత్వం. హైదరాబాద్ లోనే కాకుండా భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి,నల్లగొండల్లో నీరాను సేకరించటానికి ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. సంప్రదాయం, సంస్కృతిక, ఆధునికతతో గౌడ్ ల ఆత్మగౌవరం పెంచేలా నీరా కేఫ్ ను నిర్మించారు.గీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ నీరా కేఫ్ ను నిర్మించింది.

ఈ నీరా కేఫ్ లో ప్రత్యేకంగా లభించే డ్రింక్‌ పేరు నీరా.. ఇది ఆల్కాహాల్‌ కాదని.. ఇందులో ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేస్తున్న చెబుతున్నారు. కేఫ్‌ చుట్టూ.. తాటి చెట్లతో.. చూడటానికి కల్లు కాంపౌండ్‌ లాగా కనిపిస్తున్నా.. ఇక్కడ కల్లు, ఆల్కాహాల్‌ కనిపించదని.. కేవలం తెలంగాణ కల్చర్‌ను రిప్రజెంట్‌ చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. నీరా హెల్త్ డ్రింక్ అని నీరాతో 16 బై ప్రొడక్ట్స్ ఉంటాయని తెలిపారు. నీరా కేఫ్ లో తెలంగాణ రుచులు అందుబాటులో ఉండేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. నీరా బెల్లం, తేనె,బూస్ట్, చాక్లెట్,ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. నీరాను సేకరణ మొదలు కేఫ్ లకు చేర్చే వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.

నీరాతోపాటు, నీరా బూస్టు, షుగర్‌, హనీ, ఐస్‌క్రీమ్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వీటితోపాటు.. రెస్టారెంట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌తో కొన్ని స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మాంసం ఐటమ్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. ఈ నీరా కేఫ్ లకు మంచి ఆదరణ లభిస్తే రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించే యోచనలో ఉంది ప్రభుత్వం. జీరో పర్సంట్‌ ఆల్కాహాల్‌తో నీరాను తయారు చేస్తున్నారు. వీటి ధర గరిష్టంగా రూ.300ల వరకు ఉంటుందని సమాచారం.

నెక్లెస్‌ రోడ్డులో 2020 జులై 23న శంకుస్థాపన చేసి నిర్మించిన ఈ నీరాకేఫ్‌ నిర్మాణం పూర్తయింది.ఈరోజు మంత్రులు ప్రారంభించటంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నగర శివారు నందన వనంలోని తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్‌ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్‌లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు. ఇలా నీరాను సేకరణ మొదలు కేఫ్ లకు చేరే వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.

పల్లెల్లో తాటిచెట్ల మధ్య కూర్చుని సేవించే అనుభూతి కలిగేలా నీరా కేఫ్‌ చుట్టూ తాటి చెట్ల ఆకృతులను నిర్మించారు. నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.నీరా అంటే కల్లు అని చాలా మంది అనుకుంటారు. కానీ కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లులో ఆల్కాహాల్ కంటెంట్ ఉంటుంది. కానీ నీరాలో ఆల్కాహాల్ ఉండదు. తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.