Banjarahills Police : బంజారాహిల్స్ పీఎస్‌‌కు కొత్త సీఐ.. ఈయన ఎవరు ?

కొత్త సీఐగా నాగేశ్వరరావు నియామకం అయ్యారు. ప్రస్తుతం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ఉన్న నాగేశ్వరరావు... ఆరేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. డ్రగ్స్ విషయంలో నాగేశ్వరరావు

Banjarahills Ci

New CI For Banjarahills Police Station : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొత్త సీఐ వచ్చారు. కొత్త సీఐగా నాగేశ్వరరావు నియామకం అయ్యారు. ప్రస్తుతం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ఉన్న నాగేశ్వరరావు… ఆరేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. పబ్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన నాగేశ్వరరావు టీమ్‌… డ్రగ్స్‌ గుట్టు బయటపెట్టింది. గతంలో ఎన్నో సంచలన కేసుల గుట్టు తేల్చారు నాగేశ్వరరావు. దీంతో ఈ కేసు విచారణ నాగేశ్వరరావు చేపట్టనున్నారు. అంతకుముందు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ శివచంద్రను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. శివచంద్రపై గతంలో పలు సెటిల్‌మెంట్‌ ఆరోపణలు, పబ్‌లపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Read More : Drug Case : ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడా ? ఆ 8 మంది ఎవరు ?

ఈ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐ శివచంద్ర అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాతో మాట్లాడకుండా నిరాకరించడం, దురుసుగా ప్రవర్తించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే అతడిపై వేటు వేశారు. ఈ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖులు ఉన్నారని తేలడంతో పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. దీంతో ఇతడిని సీఐగా నియమిస్తే…కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. సీఐగా నాగేశ్వరరావును నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Read More : Radisson Blu Plaza : లిస్టులో 11 నెంబర్ గల్లా జయదేవ్ రెండో కుమారుడు, 122 నెంబర్‌‌గా రాహుల్ సిప్లీగంజ్ పేరు

ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చేస్తారోనన్న ఉత్కంఠగా నెలకొంది. సీఐ నేతృత్వంలో జరిగే దర్యాప్తు బృందంలో ఎవరు ఉంటారనేది తెలియడం లేదు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత డ్రగ్స్ పట్టుబడిందో తెలియరాలేదు. 142 మంది పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. ఇందులో 45 మంది కీలక పాత్ర పోషించారని, వీరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని తెలుస్తోంది. వీరి విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేయనున్నారు.

Read More : స్టేషన్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వారసులు వెళ్తున్న విజువల్స్..!

డ్రగ్స్‌ పార్టీ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. పార్టీ చోటు చేసుకున్న రాడిసన్‌ హోటల్‌ రూమ్స్‌లో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. డ్రగ్‌ ఆర్గనైజర్లు… హోటల్‌ రూమ్స్‌ నుంచే పార్టీకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇంకా డ్రగ్స్‌ వున్నాయనే అనుమానంతో హోటల్‌ రూమ్స్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. క్లూస్ టీమ్స్ ఆధారంగా సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు… డ్రగ్స్ కలకలంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్లకు చెందిన సెక్టార్స్ ఎస్సైలు.. డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్లను రిపోర్ట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.