Drug Case : ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడా ? ఆ 8 మంది ఎవరు ?

నివేదికలో డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా ? అనేది రిపోర్టు వచ్చిన తర్వాత తేలనుంది. 45 మందిలో ఇతని పేరు ఉందా ? అనేది తెలియరాలేదు. వీరు డ్రగ్స్ తీసుకున్నారా ? అనే...

Drug Case : ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడా ? ఆ 8 మంది ఎవరు ?

Drug Case Galla

Guntur MP Galla Jayadev Second Son : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. 142 మందితో కూడిన జాబితాను పోలీసులు రిలీజ్ చేశారు. లిస్టులో వీవీఐపీల వారసులున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విడుదల చేసిన జాబితాలో 11వ పేరుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు గల్లా సిద్దార్థ్ ఉండడం గమనార్హం. ఇతను టాలీవుడ్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు. ఇటీవలే గల్లా సిద్దార్థ్ అన్న గల్లా అశోక్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. పోలీసుల రైడ్ జరిపినప్పుడు గల్లా అశోక్ పేరు రావడంపై గల్లా ఫ్యామిలీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరాధారమైన వార్తలు ప్రసారం చేయవద్దంటూ ప్రకటన విడుదల చేసింది. అనూహ్యంగా లిస్టులో గల్లా జయదేవ్ రెండో కుమారుడు గల్లా సిద్ధార్థ్ పేరు వచ్చింది. గల్లా సిద్ధార్థ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారని తెలుస్తోంది.

Read More : Radisson Blu Plaza : లిస్టులో 11 నెంబర్ గల్లా జయదేవ్ రెండో కుమారుడు, 122 నెంబర్‌‌గా రాహుల్ సిప్లీగంజ్ పేరు

నివేదికలో డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా ? అనేది రిపోర్టు వచ్చిన తర్వాత తేలనుంది. 45 మందిలో ఇతని పేరు ఉందా ? అనేది తెలియరాలేదు. వీరు డ్రగ్స్ తీసుకున్నారా ? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 122 నెంబర్ గా రాహుల్ సిప్లీగంజ్ పేర్లున్నాయి. రాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ నార్కోటింగ్ వింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు దాడులు జరిపారు. దాదాపు 152 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావించారు. అందులో భాగంగా…ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నలుగురిని బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. మిగతా వారిని ఎందుకు అదుపులోకి తీసుకోకపోవడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Read More : Drug case : 142 మంది పేర్లు వెల్లడి, నోటీసులు ఇచ్చిన పోలీసులు

నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు పీఎస్ కు చేరుకున్నారు. అయితే.. 8 మంది పేర్లు మాత్రం కనబడడం లేదు. వీరు ఎవరనే విషయాలు తెలియరావడం లేదు. హైదరాబాద్‌లో బయటపడ్డ డ్రగ్స్‌ కేసు మొత్తం వీవీఐల పిల్లల చుట్టూనే తిరుగుతోంది. సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు మత్తు పదార్ధాలకు బానిసలుగా మారినట్టు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. పట్టుబడిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలబోమని.. కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.