Telangana BJP : కమలం పార్టీలో చేరికల జోష్.. బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలక నేతలు

కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావొద్దని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపడం ఖాయం. Telangana BJP

Joinings In Telangana BJP Party

Joinings In Telangana BJP : ఎన్నికల వేళ బీజేపీలో చేరికల జోష్ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఆ పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు కమలం కండువా కప్పుకుంటున్నారు. వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డి, రాథోడ్ బాపురావు బీజేపీలో చేరారు.

ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎల్లారెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. ఎల్లారెడ్డి టికెట్ మదన్ మోహన్ కి ఇవ్వడంతో ఆయన బీజేపీలో చేరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సుభాష్ రెడ్డి.. గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే జహీరాబాద్ కాంగ్రెస్ నేత బాణాల లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరారు.

Also Read : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్

కేసీఆర్ రావొద్దని ప్రజలు ఫిక్స్ అయ్యారు- ఈటల రాజేందర్
”రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుంది. ఒకరిద్దరు నేతలు మారుతూ ఉండొచ్చు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావొద్దని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపడం ఖాయం. కాంగ్రెస్ గత చరిత్ర తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కి పలుకుబడి, విశ్వాసం లేదు. కాంగ్రెస్ కి ఓటేసినా, బీఆర్ఎస్ కి ఓటు వేసినా ఒకటే అని ప్రజలు గ్రహించారు. అందుకే బీజేపీని గెలిపించాలి అన్న భావన ప్రజల్లో ఏర్పడింది” అని ఈటల రాజేందర్ అన్నారు.

అటు మునుగోడు కాంగ్రెస్ నేత చెలమల కృష్ణారెడ్డి.. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ చెలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి మునుగోడు స్థానాన్ని ఆశిస్తున్నారు చెలమల కృష్ణారెడ్డి.

Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి

”చలమల కృష్ణారెడ్డి, సుభాష్ రెడ్డి, రాథోడ్ బాపురావు బీజేపీ హైకమాండ్ ను కలుస్తారు. మునుగోడు తెలంగాణలో కీలక ప్రాంతం. మునుగోడులో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన వ్యక్తి కృష్ణారెడ్డి. చలమల కృష్ణా రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయన చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీకి బలం చేకూరుతుంది” అని కిషన్ రెడ్డి అన్నారు.