New Strain Tension Karimnagar : తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటిసారి ఈ జిల్లాలోనే కరోనా వ్యాప్తి చెందడం అప్పట్లో కలకలం రేపింది. బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వచ్చారు.
అందులో 16 మంది బ్రిటన్ నుంచి వచ్చినట్టు అధికారులకు సమాచారం అందింది. బ్రిటన్ నుంచి కరీంనగర్‌కు చెందిన వారంతా ఇటీవలే స్వదేశానికి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు 12 మందిని ట్రేస్ చేసి వారినుంచి శాంపిల్స్ సేకరించారు.
మరో నలుగురిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఇక అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శాంపిల్స్ ఇచ్చినవారంతా హోం క్వారంటైన్ లోనే ఉండాలని అధికారులు సూచించారు. తెలుగురాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం, బ్రిటన్ నుంచి వచ్చేవారిని గుర్తించే పనిలో పడ్డారు రెండు రాష్ట్రాల అధికారులు.