Weather Forecast : తెలంగాణలో ఇవాళ, రేపు వానలు

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న

Rains In Telangana

Weather Forecast :  విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్ధితులు నెలకొని ఉన్నాయి.  కొన్ని ప్రాంతాలలో ఎండలు మండిపోతుంటే…. కొన్ని ప్రాంతాలలో వానలు కురిసి వాతావరణం చల్ల బడుతోంది.

సోమ,మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు,మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు  వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆదివారం హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.

Also Read : Fancy Numbers : ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్-స్కూటీ వేలల్లో, నెంబరు లక్షల్లో ….!

కాగా నిన్న ఆదిలాబాద్ జిల్లా చాప్రాలా లో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంతస్ధాయిలో ఉష్ణోగ్రత నమోదవటం ఈ నెలలో ఈదే మొదటిసారి.వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.