NIA
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఎల్బీనగర్ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే, హిమాయత్ నగర్‌లో వరవరరావు అల్లుడు వేణు గోపాల్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ గా వేణుగోపాల్ ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఉదయం 4 గంటల నుంచి సోదాలు జరిగాయి. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు చేశారు. పత్రిక ప్రకటన ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్‌ను కూకట్‌పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణు నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.
సెర్చ్ వారెంట్‌తో వచ్చామన్నారు: వేణు
సోదాల తర్వాత వేణు మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం ఐదు గంటలకు తమ ఇంటికి వచ్చారని చెప్పారు. సెర్చ్ వారెంట్‌తో వచ్చామని అన్నారని వివరించారు. 2013లో నయీమ్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశానని తెలిపారు. ఆ పుస్తకాలను తీసుకెళ్లారని చెప్పారు. తన మొబైల్ సీజ్ చేశారని అన్నారు.
దీపక్‌కు, తనకు సంబంధం ఉందని కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కేసుపై గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కి లేఖ రాశాననిి చెప్పారు. తాను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యిందని తెలిపారు. దేశంలో ఎన్ఐఏ ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, జనవరి 3వ తేదీ తనపై పెట్టిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసుకుందని చెప్పారు.
ఈ కేసులో ఏ-22గా తన పేరును చేర్చారని తెలిపారు. తాను ఒక మాస పత్రిక నడుపుతున్నానని చెప్పారు.
కబలి దళం మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేసినట్టు కేసు పెట్టారన్నారు. తాను విరసంలో ప్రస్తుతం లేనని వివరించారు.
Chandrababu Naidu: ఎన్డీయేలోకి రావాలంటూ చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం?