Niranjan Reddy
Assembly Elections 2023: తెలంగాణలో 35 రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి గొప్ప విజయాన్ని అందించబోతున్నారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తమకు అక్కడక్కడ నిరసనలు ఎదురవుతున్నా వాటిని సక్కదిద్దుకుని వెళ్తున్నామని తెలిపారు.
కర్ణాటకలో గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక పోతుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. తొలి విడతగా సీఎం కేసీఆర్ చేపట్టి బహిరంగ సభలకు ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చారని అన్నారు. ఇతర పార్టీలు తెలంగాణ ప్రజల ఆవేదన పట్టించుకోవని చెప్పారు. అధికారం కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆచరణలో సాధ్యం అయ్యే అమలు గురించి మాత్రమే ఆలోచన చేస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. బాధ్యతారహితంగా కొన్ని పార్టీలు ఏది పడితే అది మాట్లాడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు తెలంగాణ డిమాండ్ వచ్చిందని అన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ గొప్పలు చెబుతోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కొందరు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఇప్పుడు విద్య, వైద్యంలో దేశంలో నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. ప్రజల కోసం పరిపాలనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
Roja : తప్పులను సరిదిద్దుకుని గెలిస్తేనే చరిత్రలో ఉంటారు- మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు