తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్వయానా మామ సూదిని పద్మారెడ్డి మెడికల్ క్లెయిమ్‌ను నివా బూపా బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని వినియోగదారుల కమిషన్‌లో దీనిపై కంప్లయింట్ దాఖలు చేశారు.
సూదిని పద్మారెడ్డి హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో ఉంటారు. ఆయన గత ఏడాది మే 13న గుండెనొప్పితో మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. అందుకు ఆయనకు రూ.23.50 లక్షల బిల్లు పడింది. ఆసుపత్రికి డబ్బులు చెల్లించారు.
Also Resd: నోరూరించే ఇటువంటి ఆహార పదార్థాలను తింటున్నారా? క్యాన్సర్‌ను రా రమ్మని పిలుస్తున్నట్టే..
తనకు ఇన్సురెన్స్ ఉండడంతో నివా బూపా కంపెనీ పాలసీ ప్రకారం బీమాకు క్లెయిమ్ చేశారు. తాను ఐదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నానని, రూ.20 లక్షల పాలసీని రెన్యూవల్ చేయించుకుంటున్నానని వివరించారు. అయితే, ఆ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించిందని అన్నారు.
తన మూడో ఏట నుంచే తాను పోస్ట్ పోలియో పెరాలసిస్‌తో బాధపడుతున్నానని అన్నారు. పాలసీదారు క్లెయిమ్‌ను పాలసీ ఇచ్చిన సమయంలో దీనిపై అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు క్లెయిమ్ చేశాక అదే కారణంతో క్లయిమ్‌ను తిరస్కరించిందని అన్నారు.