Lady Thief : సింపుల్‌గా బస్సెక్కి దిగుతూ.. 6నెలల్లోనే రూ.27లక్షలు సంపాదన.. పోలీసుల అదుపులో కి’లేడీ’

6 నెలలు.. రూ.27లక్షలు.. ఇదీ ఆ మహిళ సంపాదన.. అయితే, ఆమె చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాదు.. బిజినెస్ అంతకన్నా కాదు.. ప్రభుత్వం ఉద్యోగమూ కాదు.. మరి అంత డబ్బు ఎలా సంపాదించింది? అనే ధర్మ సందేహం తలెత్తింది కదూ.

Lady Thief : 6 నెలలు.. రూ.27లక్షలు.. ఇదీ ఆ మహిళ సంపాదన.. అయితే, ఆమె చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాదు.. బిజినెస్ అంతకన్నా కాదు.. ప్రభుత్వం ఉద్యోగమూ కాదు.. ఉద్యోగులంతా వీక్ అంతా పని చేస్తే.. ఆమె మాత్రం వీక్ అంతా రెస్ట్ తీసుకుని.. వీకెండ్స్ లో రెండు రోజులు మాత్రమే పని చేసేది. అలా.. ఆరు నెలల్లోనే రూ.27లక్షలు సంపాదించింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇంతకీ ఆమె చేసే పనేంటో తెలుసా? బస్సెక్కి దిగుతుంది.. అంతే.. అదేంటి.? బస్సెక్కి దిగితే డబ్బులు ఎలా వస్తాయి? అనే ధర్మ సందేహం వచ్చింది కదూ. మీకా సందేహం రావడంలో తప్పు లేదు. మ్యాటర్ లోకి వెళితే.. ఆమె బస్సు దిగేటప్పుడు ఒట్టి చేతులతో దిగదండోయ్. మహిళల మెడలో బంగారం.. అలా కాజేసి, ఇలా దిగిపోతుందన్న మాట.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

నిజామాబాద్ జిల్లాలో కిలేడీ అరెస్ట్ జరిగింది. బస్సులోని ప్రయాణికులను టార్గెట్ చేసి వరుస దొంగతనాలతో గత ఆరు నెలలుగా అటు ప్రజలకు ఇటు పోలీసులకు నిద్ర లేకుండా చేసిన మహిళను అరెస్ట్ చేశారు ఆర్మూరు పోలీసులు. నిందితురాలు యాదలక్ష్మి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ సుమారు రూ.27.50లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

Marriage Cheating : మేకప్‌తో యువకులను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్న 54ఏళ్ల మహిళ

Nizamabad Police Arrest Lady Thief Who Targets Bus Passengers

ఆర్టీసీ బస్టాండ్ లే ఆమె అడ్డా. బస్సు ప్రయాణికులే ఆమె టార్గెట్. రద్దీగా ఉన్న సమయం చూసుకుని చోరీ చేస్తుంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే పల్లె వెలుగు బస్సులను టార్గెట్ చేసుకుంటుంది. రద్దీ ఉన్న సమయంలో ప్రయాణికుల లగేజీ బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చోరీ చేసేది యాదలక్ష్మి. శని, ఆదివారాల్లో ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి కేవలం వీకెండ్స్ లోనే తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తుంది. చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తున్న మహిళలనే ఎక్కువగా ఆమె టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడేది. ప్రయాణికులను మాటల్లో పెట్టి సొత్తును కొట్టేసేది. గురి చూసి బంగారు నగలున్న బ్యాగులను మాయం చేసేది. ఎక్కడ రద్దీ ఉంటే అక్కడ తన చేతికి పని చెప్పేది. డబ్బు, బంగారంతో ఉడాయించేది. ఆరు నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా తన పని కానిచ్చేస్తున్న ఈ కిలాడీ లేడీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది.

Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య

నిజామాబాద్ కు చెందిన యాదిలక్ష్మిపై గతంలోనూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కిలేడీపై మొత్తం 14 కేసులు ఉన్నాయి. అన్నీ కూడా దొంగతనం కేసులే. కొట్టేసిన నగలను వెంటనే అమ్మేయకుండా పలు ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి డబ్బులు కూడా తీసుకునేదని పోలీసుల విచారణలో తేలింది.

ట్రెండింగ్ వార్తలు