NRI Application : కాంగ్రెస్ టికెట్ కోసం ఎన్నారైలు దరఖాస్తు.. ఆరు స్థానాల నుంచి ఏడుగురు

గాంధీ భవన్ లో దరఖాస్తుల పక్రియ ముగిసింది. 8 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి.

Congress NRI Application

NRI Application – Congress Ticket : కాంగ్రెస్ సీటు కోసం గాంధీ భవన్ కు దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ సీటు కోసం అభ్యర్థుల నుంచి దాదాపు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నారైలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు ఎన్నారైలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏడుగురు ఎన్నారైలు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు స్థానాల్లో ఏడుగురు ఎన్నారైలు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు.

పాలకుర్తి నుండి డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి దరఖాస్తు దాఖలు చేశారు. మక్తల్ నుండి పోలీస్ చంద్రారెడ్డి, కల్వకుర్తి టికెట్ కోసం రాఘవేందర్ రెడ్డి సుంకిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి కంది శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల నుంచి మన్యం రాజశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

Tummala Nageswararao : ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా.. కానీ, ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా : తుమ్మల

అలాగే సినీ నిర్మాత అప్పి రెడ్డి కూడా కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల టికెట్ కోసం జార్జి రెడ్డి సినిమా నిర్మాత అప్పి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అప్పి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అప్పిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోటీ నుండి తప్పుకుంటే తాను పోటీ చేస్తానని అప్పి రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినప్పుడు కోదాడ, హుజూర్ నగర్ స్థానాల్లో ఒక స్థానం తనకి ఇస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తమ్ దంపతులు పోటీ చేసినా మద్దతు ఇస్తానని, తనకు అవకాశం ఇచ్చినా తాను పోటీ చేస్తానని చెప్పారు. పలువురు ముఖ్య నేతలు దరఖాస్తులు దాఖలు చేశారు.

Congress : కాంగ్రెస్ సీటు కోసం 1000 మంది దరఖాస్తు.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, దరఖాస్తు చేయని ఐదుగురు ముఖ్య నేతలు

కొడంగల్ – రేవంత్ రెడ్డి, మధిర – భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగిత్యాల – జీవన్ రెడ్డి, కామారెడ్డి – షబ్బీర్ అలీ, వరంగల్ తూర్పు – కొండా సురేఖ, పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆంధోల్ – దామోదర రాజనర్సింహ, మంథని – శ్రీధర్ బాబు, సంగారెడ్డి- జగ్గారెడ్డి, కోదాడ – పద్మావతి ఉత్తమ్ దరఖాస్తు దాఖలు చేశారు.

నాగార్జున సాగర్ – జైవీర్ రెడ్డి (జానారెడ్డి చిన్న కుమారుడు), మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి (జానారెడ్డి పెద్ద కుమారుడు), ఎల్ బీ నగర్ – మధు యాష్కీ గౌడ్, జనగాం- పొన్నాల లక్ష్మయ్య, ములుగు – సీతక్క, వనపర్తి – చిన్నారెడ్డి, ముషీరాబాద్ – అంజన్ కుమార్, అనిల్ కుమార్ (తండ్రి కొడుకులు), తుంగతుర్తి – అద్దంకి దయాకర్, మంచిర్యాల- ప్రేమ్ సాగర్ రావు, హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ -సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు.

Appi Reddy : కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న సినీ నిర్మాత అప్పి రెడ్డి.. ఉత్తమ్ దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాల్లో

కాగా, మరో ఐదుగురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కె.జానారెడ్డి, రేణుకాచౌదరి, నాగం జనార్దన్ రెడ్డి, గీతారెడ్డి, వి.హనుమంతరావు దరఖాస్తు చేయలేదు. కాంగ్రెస్ సీటు కోసం గాంధీ భవన్ లో దరఖాస్తుల పక్రియ ముగిసింది. 8 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. శనివారం నుంచి దరఖాస్తుల స్క్రూటిని ఉంటుంది. సోమవారం టీ పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది.