Balmuri Venkat
Agnipath Protest : అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలకు ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కొన్నిప్రసార మాధ్యమాలలో వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఆవీడియోలో వివరణ ఇచ్చారు.
ఆర్మీ నియామక పరీక్ష రద్దు కావటం వల్ల గత 48 గంటల్లో చాలామంది అభ్యర్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆవేశానికి లోనైన అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో ఎన్ఎస్‌యూఐ కి ఎలాంటి సంబంధంలేదు. అభ్యర్ధుల నిరసనలో మా ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలను ఎన్ఎస్‌యూఐ చేయబోదని ఆయన తెలిపారు.
నేను ఇవాళ ఉదయం ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి షా ఇనాయత్ గంజ్ పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు. అందుకే నేను పోలీసు స్టేషన్ నుంచే ఈ వీడియో ద్వారా స్పష్టం చేస్తున్నాను…. అని వెంకట్ ఆ వీడియో సందేశంలో పేర్కోన్నారు.
Also Read : Agnipath: ‘అగ్నిపథ్’పై యువతకు సరైన సమాచారం లేదనుకుంటున్నా: ఆర్మీ చీఫ్ జనరల్