Agnipath: ‘అగ్నిపథ్’పై యువతకు సరైన సమాచారం లేదనుకుంటున్నా: ఆర్మీ చీఫ్ జనరల్

కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై యువతకు సరైన సమాచారం లేదనుకుంటున్నా: ఆర్మీ చీఫ్ జనరల్

Agnipath

Agnipath: యువతకు ‘అగ్నిపథ్’పై సరైన సమచారం లేదనుకుంటున్నానని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారని భావిస్తున్నట్లు చెప్పారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Agnipath: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు మృతి

ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు. ‘‘‘అగ్నిపథ్’పై సరైన సమాచారం లేకపోవడం వల్లే యువత ఆందోళన చేస్తోంది. ఈ పథకం గురించి పూర్తి సమాచారం తెలిసిన తర్వాత ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. కోవిడ్ వల్ల రెండేళ్లు ఆర్మీ నియామకాలకు దూరంగా ఉన్న ఉత్సాహవంతులైన యువతకు, వయో పరిమితి పెంచడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ నిర్ణయం ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని భావించే యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఈ ఒక్కసారి మాత్రమే వయోపరిమితి పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ‘అగ్నిపథ్’ నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువత అగ్నివీరులుగా మారుతారని ఆశిస్తున్నా.

Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు

రెండు రోజుల్లో joinindianarmy.nic.in లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఆ తర్వాత ఆర్మీ రిక్రూట్‌మెంట్ సంస్థలు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పూర్తి వివరణాత్మక షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. రిక్రూట్‌మెంట్ శిక్షణా కేంద్రాలకు వెళ్లే అగ్నివీరులకు డిసెంబర్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది’’ అని మనోజ్ పాండే తెలిపారు.