NTR Centenary Celebrations(Photo : Google)
NTR Centenary Celebrations – Hyderabad : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రేపు (మే 20) హైదరాబాద్ లో జరగనున్నాయి. ఖైతలాపూర్ గ్రౌండ్ (Kaitalapur Maidan)లో ఏర్పాట్లను మురళీమోహన్, టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ పరిశీలించారు. రేపు సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతాయని.. సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తెలిపారు. ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుందాం అన్నారు. ఎన్టీఆర్ లో దేవుడి రూపం చూశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కాసాని పిలుపునిచ్చారు.
నందమూరి రామకృష్ణ
ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే. ఎన్టీఆర్ అందరి వాడు. ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ కు అందరూ అభిమానులే. నటుడిగా ఉంటూనే ప్రజలకు ఎంతో సేవ చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
Also Read..Adipurush : ఆదిపురుష్ రన్ టైం ఎంతో తెలుసా.. జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!
మురళీమోహన్
గత సంవత్సరం మే28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. పుణ్య పురుషులను మనం అరుదుగా చూస్తుంటాం. అలాంటి పుణ్య పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ లాంటి పురుషుడు కోటికి ఒకరు పుడతారు. కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి 9 నెలల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది. శతజయంతి ఉత్సవాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ తో పని చేసిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. బండారు దత్తాత్రేయ, ఏచూరి, డి రాజా తదితరులు హాజరవుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సత్కరించనున్నాం. ఎన్టీఆర్, చంద్రబాబు నీతిగా నిజాయితీగా పరిపాలన చేశారు. వారి కుటుంబ సభ్యులు ఎక్కడా పాలనలో కల్పించుకోలేదు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తాం.
Also Read..Rajinikanth : రజినీకాంత్‌కి అదే చివరి సినిమా.. తమిళ దర్శకుడు సంచలన కామెంట్స్!
టీడీ జనార్దన్
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు ఉంటుంది. ఎన్టీఆర్ చరిత్ర గురించి ప్రత్యేక వెబ్ సైట్స్ రూపొందించాం. 500 పేజీల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించనున్నాం. ఎన్టీఆర్ పేరుతో ప్రత్యేక యాప్ ను లోకేశ్ ఆవిష్కరిస్తారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించనున్నాం. టీడీపీ ప్రముఖులను సత్కరించనున్నాం.