Ode To Equality : ముస్తాబైన ముత్తించల్.. తొలిరోజు కార్యక్రమాలు

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు...

Samatamurthi

Chintal Sri Ramanujacharya Statue: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లువిరుస్తోంది. రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12 రోజుల పాటు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. వేలాది మంది వాలంటీర్లు, రుత్విక్కులు, ఇతరుల రాకతో ముచ్చింతల్ లో ఉత్సవ వాతావరణం ఏర్పడింది. ఫ్లెక్సీలు, తోరణాలతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా దర్శనిమిస్తున్నాయి.

Read More : Chiranjeevi : అభిమాని కూతురి పెళ్ళికి మెగాస్టార్ సాయం..

అష్టాక్షరీమంత్ర జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమయ్యింది. సమతామూర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా 12 రోజుల పాటు జరిగే వేడుకల కోసం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ముస్తాబయ్యింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ జరగనుంది. వెయ్యి 35 కుండాలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం కుండల్లోని పుట్టమట్టిలో నవధాన్యాలను అలకటం ద్వారా అంకురార్పణ చేయనున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌స్వామి ఆశ్రమ ప్రాంగణంలో దాదాపు వెయ్యి కోట్ల భారీ వ్యయంతో 45 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అద్భుత, దివ్య క్షేత్రం.. భక్తులకు కనువిందు చేయబోతోంది.

Read More : Aishwaryaa : ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య కరోనాతో హాస్పిటల్‌లో

వెయ్యేళ్ల కిందట ఎన్నో వైషమ్యాలు, వైరుధ్యాలు.. అంటరానితనం కరాళనృత్యం చేస్తున్న సమయంలో ప్రాణికోటి అంతా ఒకటేనని, మనుషుల మధ్య తేడాల్లేవని ప్రబోధించి సమానత్వ భావాలు నాటారు ఆచార్య రామానుజులు. మళ్లీ ఇప్పుడు అసమానతలు దేశ పురోగతికి అడ్డంకిగా మారుతున్న సమయంలో ఆయన నింపిన స్ఫూర్తి మరోసారి ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందంటూ చిన్నజీయర్‌ స్వామి ఈ బృహత్‌ క్షేత్ర నిర్మాణానికి పూనుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 8 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఉత్సవాల్లో కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి. అరణి మతనం, అగ్నిప్రతిష్ట జరుగనున్నాయి. కార్య్రక్రమాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.