GHMC candidates, 49 are criminals : GHMCలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు ఉన్నారు. 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 43 మంది పురుషులు కాగా.. ఆరుగురు మహిళలు. బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది, టీఆర్‌ఎస్ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి 12 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురిపై కేసులు ఉన్నాయి.
మరోవైపు…GHMC ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో 601 సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లలో.. 1 వేయి 704 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు గుర్తించారు. అలాగే 307 అత్యంత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లలో 1 వేయి 85 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు గుర్తించారు. సిటీ వ్యాప్తంగా 15 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.
https://10tv.in/congress-leader-vijayashanti-tweet-on-surgical-strike/
ఇప్పటివరకూ 1 వేయి 167 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. 3 వేల 744 లైసెన్స్‌డ్ వెపన్స్‌ను పోలీస్ స్టేషన్‌లలో డిపాజిట్ చేశారు నేతలు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన 19 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ పోలీసుల తనిఖీల్లో కోటి 40 లక్షల నగదు సీజ్ చేశారు. 10 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 59 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.